TGSRTC: ట్రైనీ ఐఏఎస్‌లకు ‘ఆర్టీసీ-మహాలక్ష్మి పథకం’పై సజ్జనార్‌ అవగాహన

తెలంగాణ కేడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందానికి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అవగాహన కల్పించారు.

Update: 2024-06-07 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందానికి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అవగాహన కల్పించారు. 'టీజీఎస్‌ఆర్టీసీ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌- మహాలక్ష్మి పథకం అమలు' అనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి-మానవ వనరుల అభివృద్ది కేంద్రం (ఎంసీఆర్‌-హెచ్‌ఆర్డీ)లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో.. సీడీఎస్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ కందుకూరి ఉషారాణి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌‌తో పాటు ట్రైనీ ఐఏఎస్‌లు మనోజ్‌, మృణాల్‌, శంకేత్‌, అభిజ్ఞాన్‌, అజయ్‌, తదితరలు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..