సదర్ ఉత్సవాల్లో కీలక మార్పులు.. మాజీ ఎంపీ ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట సొంత నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక డిమాండ్ పెట్టారు.

Update: 2024-10-22 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట సొంత నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక డిమాండ్ పెట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ నెల 27న నిర్వహించే సదర్‌ సమ్మేళన్(Sadar Festival 2024) పోస్టర్‌‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన చేపట్టడం హర్షణీయమని సీఎం రేవంత్‌‌ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రశంసల వర్షం కురిపించారు. మూసీలో నీళ్లు లేక పశువులకు మేత దొరకడం లేదని అన్నారు. ఈ కారణంగా హైదరాబాద్‌లో బర్రెల సంఖ్య భారీగా తగ్గిపోయిందని తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు సదర్‌ సమ్మేళన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటన చేశారు.

సదర్‌ను రాష్ట్ర పండుగగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా, యాదవ సామాజికవర్గం అత్యంత వైభవంగా నిర్వహించే పండుగల్లో సదర్ ఉత్సవం ఒకటి. గతంలో ఈ ఉత్సవాన్ని వివిధ యాదవ రాజ వంశీయులు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ పండుగను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో 'పోలా' అని, కర్ణాటక రాష్ట్రంలో 'కంబాల'ని, తమిళనాడులో 'జల్లికట్టు' , నేపాల్లో 'మాల్వి' అని అంటే, ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే దీన్ని 'సదర్' గా పిలుస్తున్నారు.

Tags:    

Similar News