Runa Mafi : రెండో విడత రైతు రుణమాఫీ వేదిక అదుర్స్.. స్పెషాలిటీ ఇదే..! (వీడియో)
తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో రూ.లక్ష వరకు ఉన్న రుణమాఫీని ప్రభుత్వం మాఫీ చేసింది. మొత్తం 10.83లక్షల మంది కుటుంబాలకు చెందిన 11.34 లక్షల ఖాతాల్లో రూ.6,035 కోట్లు జమ చేసినట్లు సర్కారు వెల్లడించింది. కాగా, నేడు రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ వీక్షకులను ఆకర్షిస్తోంది. ధాన్యం రాశులు, కూరగాయాలు, గేదేలు, ఆవులకు మేత వేసే గడ్డి, మొక్కజొన్న పొద్దులు, వివిధ రకాల పూలను సీఎం కూర్చునే వేదిక ముందు ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. ప్రస్తుతం ఈ అలంకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.