ఈ నెల 30 నుంచి నూతన సచివాలయంలో పాలన
ఈనెల 30వ తేదీ నుంచి నూతన సచివాలయం లో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అదే రోజు ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 30వ తేదీ నుంచి నూతన సచివాలయం లో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అదే రోజు ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట 20 నుంచి ఒంటిగంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఆ తర్వాత సమీకృత కొత్త సచివాలయం ప్రారంభించనున్నారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీ అభివృద్ధి, రెవిన్యూ శాఖలు, మొదటి అంతస్తులో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖలు, రెండోవంతస్తులో ఫైనాన్స్, ప్లానింగ్, వాణిజ్య పన్నుల శాఖ, మూడోవంతస్తులో మున్సిపల్, పట్టణ, పరిశ్రమల అభివృద్ధి శాఖ, నాలుగో అంతస్తులో నీటిపారుదల, అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ, 5వ అంతస్తులో రవాణా, రోడ్డు భవనాలు, సాధారణ శాఖలు, ఆరవంతస్తులో సీఎం, సి ఎస్, సీఎమ్ఓ, ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బిఆర్కెఆర్ భవన్ లో పరిపాలన కొనసాగించిన ప్రభుత్వం నూతన భవన్లో ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను, కంప్యూటర్లను షిఫ్టింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఏ ఏ శాఖ ఆ శాఖ సంబంధించిన ఫైళ్లను కంప్యూటర్లను నూతన భవనంలోకి మార్చేందుకు సమయాన్ని కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నేడు ఎస్సీ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, టి డబ్ల్యూ డిపార్ట్మెంట్, సి ఏ ఎఫ్ అండ్ సి ఎస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఫైళ్లను మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తరలించాలని ప్రభుత్వం సమయాన్ని కేటాయించింది. అదేవిధంగా మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎం ఏ యు డి డిపార్ట్మెంట్, వై ఏ టి అండ్ సి డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఫైళ్లను తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెచ్ ఎం అండ్ ఎఫ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ను తరలించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఈ ఎఫ్ ఎస్ అండ్ టి డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఫైలను తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 28 శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎల్ ఈ టి అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్, పి ఆర్ అండ్ ఆర్ డి డిపార్ట్మెంట్, ఏ హెచ్, డిడి అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్, ఏ అండ్ సి డిపార్ట్మెంట్, ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ శాఖలను షిఫ్టింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు డబ్ల్యూ సి డి అండ్ ఎస్ సి డిపార్ట్మెంట్, ఐ అండ్ సి డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లను తరలించాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. అన్ని శాఖలను ఒకేసారి తరలిస్తే ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో శాఖలకు సంబంధించిన ఫైళ్లను షిఫ్టింగ్ చేసేందుకు సమయాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.