బిగ్ బాస్ అభిమానులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్

ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ను ప్రకటించిన తర్వాత ఆ షోలోని పలువురి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ రోడ్లపై హంగామా సృష్టించారు.

Update: 2023-12-18 06:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ను ప్రకటించిన తర్వాత ఆ షోలోని పలువురి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ రోడ్లపై హంగామా సృష్టించారు. కృష్ణ నగర్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున వచ్చిన బిగ్ బాస్ అభిమానులు.. రచ్చ చేస్తూ.. ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ అభిమానులపై ఫైర్ అయ్యారు.

సజ్జనార్ తన ట్వీట్‌లో.. హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News