వాట్సాప్ డీపీ మార్చండి.. తెలంగాణ యువతకు RS ప్రవీణ్ కుమార్ పిలుపు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ మొదలు.. గ్రూప్-1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ మొదలు.. గ్రూప్-1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్న తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ వల్ల దగాపడ్డ నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరిగేంతవరకు నా వాట్సాప్ డీపీ ఇదే. తెలంగాణ ప్రజలందరిని ఈ ఫోటోను స్వచ్ఛందంగా తమ డీపీగా పెట్టుకొని మన బిడ్డలకు బాసటగా నిలవాలని మనవి.’’ అని సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేసి, నిరుద్యోగ యువతకు ఆర్ఎస్‌పీ పిలుపునిచ్చారు.
తెలంగాణలో #TSPSC వల్ల దగాపడ్డ నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరిగేంతవరకు నా WhatsApp DP ఇదే.తెలంగాణ ప్రజలందరిని ఈ ఫోటోను స్వచ్ఛందంగా తమ DPగా పెట్టుకొని మన బిడ్డలకు బాసటగా నిలవాలనా మనవి. I appeal to Telangana people to change their WhatsApp DP till justice is done to victims of #TSPSC pic.twitter.com/V9OvMlQMjd
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 20, 2023