'విద్యార్థులారా.. ఈ దొంగ కేసులకు భయపడకండి'
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తండాకు చెందిన రాథోడ్ సురేశ్ అనే స్టూడెంట్ హాస్టల్ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, హాస్టల్‌లో ఇంతటి ఘోరం జరిగి.. గంటలు గడుస్తున్నా వర్సిటీ ఆఫీసర్లు ఎవరూ రాలేదని, క్యాంపస్ లో అంబులెన్స్ కూడా లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారుల తీరుకు నిరసిస్తూ.. స్టూడెంట్లు మౌనదీక్ష చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''బాసర IIIT విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా బాసర IIIT విషయంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిపై 306 IPC and 420IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. విద్యార్థులారా, ఈ దొంగ కేసులకు భయపడకండి. మన బహుజనరాజ్యం రాబోతున్నది.'' అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
బాసర IIIT విద్యార్థుల పై పోలీసులు పెట్టిన కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా బాసర IIIT విషయంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పై 306 IPC and 420IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. విద్యార్థులారా, ఈ దొంగ కేసులకు భయపడకండి. మన బహుజనరాజ్యం రాబోతున్నది.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 24, 2022