'రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర'
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ పై బహిష్కరణ వేటు దుమారం రేపుతోంది. అనుచిత
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ పై బహిష్కరణ వేటు దుమారం రేపుతోంది. అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనపై అధిష్టానం సీరియస్ అయింది. రాజాసింగ్ చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగడంతో.. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఈ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. బీజేపీలో రాజాసింగ్, నుపుర్ శర్మలను పెంచి పోషించింది ఎవరు అని ప్రశ్నించారు. రాజాసింగ్ గతంలోనూ మైనారిటీ ప్రజల మనోభావాలను, మత ఆచారాలను కించపరిచారని, అలాగే పేద ప్రజల ఆహారపు అలవాట్లను ఘోరంగా అవమానించారన్నారు. అలాంటి వ్యక్తిపై అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు.
ఇందంతా కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. బీజేపీ భగావో- దేశ్ కో బచావో అంటూ ట్వీట్ చేశారు. కాగా బీజేపీలో కీలక నేతల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ ,విదేశాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై పార్టీ వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.