సబ్సిడీ బియ్యానికి రూ . 2 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చేందుకు ముందడుగు వేసింది. ఈ స్కీం అమలు చేసేందుకు ప్రభుత్వం రూ . 2 వేల కోట్లను కేటాయించింది.

Update: 2024-08-14 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చేందుకు ముందడుగు వేసింది. ఈ స్కీం అమలు చేసేందుకు ప్రభుత్వం రూ . 2 వేల కోట్లను కేటాయించింది. 2024 -25 ఏడాదికి సబ్సిడీ కింద ఆర్థిక శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది . ఇందుకు కావాల్సిన నిధులను విడుదల చేస్తూ ఆ ప్రిన్సిపాల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాదికి నిధులను వినియోగించనున్నారు. సన్న బియ్యం పంపిణీలో జాప్యం జరగకుండా ఈ స్కీం ను పకడ్బందీగా అమలుకు కావాల్సిన నిధులను ముందుగానే సమకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రేషన్ షాపుల ద్వారా దారిద్య రేఖకు దిగువన వున్న ప్రజానీకానికి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యానికి అందిస్తామని, హామీ ఇచ్చింది . ఈ మేరకు అందుకు కావాల్సిన నిధులకు పరిపాలన అనుమతి లభించడంతో పేదలకు సన్నబియ్యం అందించడానికి లైన్ క్లియర్ అయింది .


Similar News