Rhodamine-B: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడమైన్ బీపై నిషేధం
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బీని పూర్తిగా బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ కలరింగ్ ఏజెంట్‌ను పీచు మిఠాయి, గోబీ మంచురియ తయారీలో చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. కాగా, ఫుడ్ ఐటమ్స్‌లో ఎక్కువగా అడిటివ్స్ కలుస్తున్నాయని ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం రోడమైన్-బీని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. గత నెలలోనే తమిళనాడు సర్కార్ కూడా కాటన్ క్యాండీ, ఫుడ్ ఐటమ్స్ కోసం వాడే కలర్స్‌ను నిషేధించింది. టెక్స్‌టైల్స్‌లో డై కోసం వాడే రోడమైన్-బీ ప్రజల ఆరోగ్యానికి హానీ తలపెడుతుందని పరిశోధనల్లో తేలింది.