Revanth: ప్రజా పాలనలో యువ వికాస వసంతం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నిత్యం నోటిషికేషన్లతో ప్రజాపాలనలో(Public Administration) నిరుద్యోగం(Unemployment) తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

Update: 2024-12-04 05:50 GMT

దిశ, వెబ్ డెస్క్: నిత్యం నోటిషికేషన్లతో ప్రజాపాలనలో(Public Administration) నిరుద్యోగం(Unemployment) తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవాల పేరుతో వేడుకలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి(Peddapalli)లో యువవికాసం(Yuva Vikasam) పేరుతో సభ నిర్వహిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. నిరుద్యోగంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. మొన్న కొలువులే ఆలంబనగా.. ఉద్యమం కొలిమిలా మండిందని, నిన్న కొలువులే ఆకాంక్షగా.. తన రణం జంగ్ సైరనై మోగిందని గుర్తు చేశారు. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం.. ప్రజా పాలనలో యువ వికాస వసంతం అని, ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామకం అని తెలియజేశారు. అలాగే నిత్య నోటిఫికేషన్ల తోరణం.. ఏడాది ప్రజా పాలనలో తగ్గుతున్న నిరుద్యోగం అని వ్యాఖ్యానించారు. ఈ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు పెద్దపల్లి నేడు వస్తున్నానని సీఎం వెల్లడించారు.

Read More:   KTR : యువ వికాసం కాదు.. యువ విలాపమే : కేటీఆర్

Tags:    

Similar News