రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. ఒక్కో మెట్టు ఎక్కుతూ!
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు. సుదీర్ఘ మంతనాల తర్వాత రేవంత్‌నే ఫైనల్ చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7వ తేదీన గురువారం రాష్ట్ర ముఖ్యమత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం...
ప్రస్థానం :
= 1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి
= స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి
= 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా విజయం
= 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్రంగా ఎన్నిక
= 2009లో టీడీపీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం
= 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
= 2014–17 మధ్య తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్
= 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
= 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
= 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
= 2018లో కాంగ్రెస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ(ఓటమి)
= 2019 మేలో కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీగా విజయం
= 2021లో జూన్ 26న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్
= 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
= 2023 డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణం
Read more: For Special Edition on Telangana Chief Minister Revanth reddy