ధాన్యం కొనుగోళ్ల‌పై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో తాజాగా ఆందోళనకు దిగారు.

Update: 2024-04-11 08:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో తాజాగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు.

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటన పై సకాలంలో స్పందించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌కి నా అభినందనలు అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags:    

Similar News