పోయే కాలం వస్తే ఇంతేనేమో.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ బిడ్డల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్
దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ బిడ్డల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనలో వలస కార్మికులకు ఇచ్చిన పరిహారంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. తాజాగా.. దీనిపై టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ''స్వరాష్ట్ర బిడ్డలపై కేసీఆర్ వివక్షకు కారణమేంటో అర్థం కావడం లేదు. తెలంగాణ అమరవీరుల, వీర జవాన్ల త్యాగాలు.. గల్ఫ్ కార్మికుల అకాల మరణాలు ఆయనకు ఆవేదన కలిగించడం లేదు. బీహార్ వలస కార్మికులపై ఉన్న సానుభూతి మనవాళ్లపై లేదు. పోయే కాలం వస్తే ఇంతేనేమో...!'' అంటూ ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు.
స్వరాష్ట్ర బిడ్డలపై కేసీఆర్ వివక్షకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు!?
— Revanth Reddy (@revanth_anumula) September 2, 2022
తెలంగాణ అమరవీరుల, వీర జవాన్ల త్యాగాలు... గల్ఫ్ కార్మికుల అకాల మరణాలు ఆయనకు ఆవేదన కలిగించడం లేదు. బీహార్ వలస కార్మికుల పై ఉన్న సానుభూతి మనవాళ్ల పై లేదు.
పోయే కాలం వస్తే ఇంతేనేమో...! pic.twitter.com/IDRTY69iVl