తెలంగాణ జవాన్లపై ఎందుకంత చిన్నచూపు? నిలదీసిన రేవంత్

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉ

Update: 2022-08-30 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు నీటి విషయంలో శాశ్వతంగా నష్టం కలిగించాయని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్, బీజేపీ ప్రలోభ పెడుతున్నాయని ఆరోపించారు. నేతల జేబులు నిండాయి తప్పా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఒరింగిదేమి లేదన్నారు. డిండి ప్రాజెక్టుకు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం, పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని కారణంగా నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ జిల్లా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. మునుగోడులో ప్రతి ఇంటికి నియోజకవర్గంలో పర్యటిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 1 నుండి మునుగోడులో టీఆర్ఎస్,బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుగా మార్చుతోందని ఫైర్ అయ్యారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను పిలవడం లేదని, ఇది మంచి సంస్కృతి కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూముల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ ఇబ్బుదులకు గురి చేస్తోందని, ధరణి పేరుతో పోడు భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పై చార్జ్ షీట్ రూపొందించి ప్రజల ముందు ఉంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ప్రజలకు ఇస్తామన్నారు.

తెలంగాణ జవాన్లపై ఎందుకంత చిన్నచూపు

తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన ఆర్మీ జవాన్ ల కుటుంబాలను పరామర్శించని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో పరామర్శలకు వెళ్తున్నాడని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఢీ, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పార్టీ విస్తరించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్ లు, కాంట్రాక్ట్ లు అని పైర్ అయ్యారు. ఇక గుజరాత్ మోడల్ పేరుతో బీజేపీ రాష్ట్రంలోకి వస్తోందని అసలు గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తుల విధ్వంసం చేయడమేనని ఆరోపించారు. తెలంగాణ మోడల్ పేరుతో ఒకరు దేశం మీదకు వెళ్తుంటే గుజరాత్ మోడల్ పేరుతో మరొకరు తెలంగాణవైపు వస్తున్నారని అన్నారు.

బీజేపీ చేతిలో ఆజాద్ కీలుబొమ్మ

పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సందట్లో సడేమియాలా ఆజాద్ మోడీకి గులాంగా మారారని విమర్శించారు. ఆయనకు కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని చూసిందని, కానీ రాజ్యసభ రెన్యూవల్ చేయలేదని పార్టీని వదిలి వెళ్లారని ఆరోపించారు. గులాం నబీ ఆజాద్ పట్ల గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు అది పాతాళంలోకి పారేసుకున్నారని విమర్శించారు. గుజరాత్ లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారి కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉండగా ఎందుకు విమర్శలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో పార్టీ ఇన్ చార్జీ బాధ్యతలు సైతం కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేశారు.

Tags:    

Similar News