Revanth Reddy : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

కే‌సీ‌ఆర్ చేతిలో మోసపోయిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Update: 2023-06-14 09:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కే‌సీ‌ఆర్ చేతిలో మోసపోయిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కే‌సీ‌ఆర్ సర్కార్‌ను కూల్చడమే అందరి లక్ష్యం అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నదని, ఈసారి పవర్‌లోకి రావడం పక్కా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.

పార్టీలోకి వచ్చిన శ్రీహరి రావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. కొందరు పార్టీ వీడితే నాయకులే ఉండ రన్నట్లు వ్యవహరించారనీ, కానీ అంతకంటే బలమైన నాయకులు పార్టీలోకి వచ్చారన్నారు. ఖచ్చితంగా నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందన్నారు

కొడంగల్‌లో గెలవడం తనకు ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ఇంపార్టెంట్ అన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నా నిర్మల్‌లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారన్నారు. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలని రేవంత్ సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని వెల్లడించారు.

ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక ఇక తెలంగాణ ప్రజలకు లేదన్నారు. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయినవారి జాబితాలో శ్రీహరి రావు మొదట్లో ఉంటారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రేవత్ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 10కి కనీసం 8 సీట్లు గెలిపించుకోవాలన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుఫాన్ రాబోతుందన్నారు.

నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రతీ గుండెకు కాంగ్రెస్ పార్టీని చేర్చాలన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఉన్నదని తలుపు తడితే చాలు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టడం ఖాయం అన్నారు.

Also Read:  రేవంత్ రెడ్డితో పొంగులేటి భేటీ! 

Tags:    

Similar News