TG Assembly : గత కేసీఆర్ ప్రభుత్వ రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. ఐదో రోజు ఏకంగా 17 గంటలకు పైగా శాసనసభ జరిగింది.

Update: 2024-07-30 09:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. ఐదో రోజు ఏకంగా 17 గంటలకు పైగా శాసనసభ జరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ.. మంగళవారం వేకువ జామున 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. అయితే, గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం 12 గంటల పాటు సభను నడిపింది. ఇప్పుడు ఆ రికార్డును రేవంత్‌ సర్కార్ బ్రేక్‌ చేసింది.

ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం 3 గంటల వరకు అసెంబ్లీ నడిపారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సెషన్‌లో 19 పద్దులకు ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ పద్దులపై ఐదుగురు మంత్రులు తమ సమాధానాలు ఇచ్చారు.

Tags:    

Similar News