Renuka Chowdhury : రాజ్యసభకు రేణుకాచౌదరి.. ఏఐసీసీ కీలక నిర్ణయం

ఫైర్ బ్రాండ్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Update: 2024-02-14 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫైర్ బ్రాండ్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కాసేపట్లో రేణుకా చౌదరి నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కు ఉండగా.. ఒకటి రేణుకా చౌదరికి కేటాయించగా మరొకటి ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రెండో రాజ్యసభ సీటు కోసం సుప్రియ లేదా అజయ్ మాకెన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఖమ్మం ఎంపీ స్థానం ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ బెర్తు కన్మార్మ్ కావడంతో ఆ సెగ్మెంట్ నుంచి ఎవరు బరిలో నిలవనున్నారనేది ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News