చంద్రబాబు ప్రాణాలకు ముప్పు.. మాజీ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆమె.. ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారని, రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయనకు సేఫ్ కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జగన్‌పై ఆమె తీవ్ర విమర్శలు కురిపించారు.
జగన్ ఒక మెంటల్ అని, ఏమైనా చేస్తాడని రేణుకా చౌదరి ఆరోపించారు. సొంత బాబాయిని చంపుకున్న వాడికి చంద్రబాబు ఒక లెక్కా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మానస్థిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు తన సొంత డబ్బులతో చికిత్స చేయిస్తానన్నారు. బంగారం లాంటి ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని, సుప్రీం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబుకు అందరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు.