కాంగ్రెస్ పార్టీ గంగానది లాంటిది.. ఎవరైనా పార్టీలో చేరవచ్చు: రేణుకా చౌదరి
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. సొంత పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. సొంత పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించక పోవడం పట్ల అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో తుమ్మల విషయంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోందని నిజంగా తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతానంటే అడ్డు చెప్పబోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని ఈ నది ప్రవహించినట్లుగానే కాంగ్రెస్‌లోకి నేతలు వస్తూనే ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో యూ టర్నన్‌లు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ ఎక్కడికి వెళ్లినా వన్ వే ట్రాఫిక్ లో ఇరుక్కుంటోందని ఎద్దేవా చేశారు. 'చేయి' వదిలి కారెక్కిన వారంతా అక్కడ జరుగుతున్న యూ టర్న్ లను చూసి తిరిగి వస్తామని ఫోన్లు చేస్తున్నారని చెప్పారు.