రేపు భూమి ఎజెండా విడుదల.. లీఫ్స్ ఆధ్వర్యంలో కీలక చర్చ

లీఫ్స్ సంస్థ భూ సంబంధిత అంశాలపై ‘భూమి సంవాద్’ పేరుతో కొన్నేండ్లుగా అనేక చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. మెరుగైన భూ పరిపాలన, భూమి సమస్యల పరిస్కారం కోసం సూచనలు అందిస్తుంది.

Update: 2023-11-02 13:48 GMT

దిశ, ఖైరతాబాద్: లీఫ్స్ సంస్థ భూ సంబంధిత అంశాలపై ‘భూమి సంవాద్’ పేరుతో కొన్నేండ్లుగా అనేక చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. మెరుగైన భూ పరిపాలన, భూమి సమస్యల పరిస్కారం కోసం సూచనలు అందిస్తుంది. ఈ భూమి చర్చా సిరీస్‌లో భాగంగా నాలుగో తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో "భూమి ఎజెండా - తెలంగాణ ఎన్నికలు – ప్రజల ఆకాంక్షలు" అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రైతులను, మేధావులను, ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీల ప్రతినిధులను, న్యాయ, రెవెన్యూ నిపుణులను, భూమి సంబంధిత అంశాలపై పని చేస్తున్నవారిని నిర్వాహకులు ఆహ్వానిస్తుంచారు. మానవ మనుగడ భూమితో ముడిపడి ఉంది. భూమి ఉంటేనే జీవితం. భూమి హక్కు ఒక రాజ్యాంగ హక్కు.

ఐక్య రాజ్య సమితి గుర్తించిన మానవ హక్కు. సమతుల అభివృద్ధి లక్ష్యాలలో కూడా భూమి హక్కు కీలకం. భూమితోనే అభివృద్ధి. దేశ స్థూల జాతీయ ఆదాయం పెరగాలన్న, న్యాయ స్థానాలలో వివాదాలు, నేరాలు తగ్గాలన్నా, రైతుల ఆదాయం పెరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా భూమి సమస్యను పరిష్కరించుకోవడం తప్పనిసరి. భూమి హద్దులు స్పష్టంగా, హక్కులు భద్రంగా ఉంచే వ్యవస్థను తేవడం అవసరం. భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం అయితేనే అభివృద్ధి చెందిన తెలంగాణ సాధ్యమౌతుంది. రైతు జీవితం మెరుగు పడుతుంది. ఇంత కీలకమైన భూమి అందరి ప్రధాన ఎజెండా కావాలి. ప్రజల భూమి ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి జరగాలి. ఈ చర్చా కార్యక్రమం అందుకోసం ఒక ప్రయత్నమని, అందరూ తప్పక హాజరు కావాలని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అధ్యక్షుడు ఎం.సునీల్ కుమార్, లీఫ్స్ సలహాదారు కరుణాకర్ దేశాయ్, ఉపాధ్యక్షుడు జి. జీవన్ రెడ్డిలు కోరారు.

Tags:    

Similar News