గ్రూపు -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫైనల్ ‘కీ’ విడుదల

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ‘ఆన్సర్ కీ’ని టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. అభ్యర్థులకు ఆగష్టు ఒకటి నుండి వెబ్సైటులో అద్నుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Update: 2023-08-01 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ‘ఆన్సర్ కీ’ని టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. అభ్యర్థులకు ఆగష్టు ఒకటి నుండి వెబ్సైటులో అద్నుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 28న ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ జులై 1 నుంచి జులై 5 వరకు ఆన్సర్ కీ అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకుని పరిశీలించిన విషయ నిపుణులు రూపొందించిన గ్రూప్-1 తుది కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

రాష్ట్రంలో 503 'గ్రూప్‌-1' సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్‌ 11న నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పునఃపరీక్షకు 2,33,506మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అందరి అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను స్కాన్, ఇమేజింగ్‌ ప్రక్రియను పూర్తిచేసి జూన్ 28 నుండి జులై 27 వరకు అధికారిక వెబ్సైటులో పొందుపర్చారు. కీ పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు http :// www . tspsc .gov . in నందు సందర్శించి ఫైనల్ కీ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.


Similar News