పెరగనున్న ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు.. త్వరలో అధికారిక ఉత్తర్వులు
ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని వైద్యశాఖ భావిస్తున్నది. కొత్తగా ఏర్పాటయ్యే హాస్పిటళ్లకు ఈ టారీఫ్‌లు వర్తింపజేయనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని వైద్యశాఖ భావిస్తున్నది. కొత్తగా ఏర్పాటయ్యే హాస్పిటళ్లకు ఈ టారీఫ్‌లు వర్తింపజేయనున్నది. ప్రస్తుతం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు తక్కువగా ఉన్నాయని భావించిన వైద్యశాఖ, బెడ్స్ వారీగా ఫీజులు నిర్ణయించాలని ఆలోచిస్తున్నది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 200 పడకలు, ఆ పైన ఉన్న పెద్ద ఆస్పత్రులకు రూ.16 వేలు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జి ఉన్నది. దీన్ని పెంచాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉన్నది.