ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా

ఆర్ అండ్ బీ ఈఎన్సీ పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌గా ఉంది.

Update: 2024-09-03 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ అండ్ బీ ఈఎన్సీ పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంచనా పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌గా ఉంది. అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌కు అందజేశారు. 2017లోనే గణపతి రెడ్డి రిటైర్మెంట్ అయినా.. ఏడు సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ సైతం గత తొమ్మిది నెలలుగా ఈఎన్సీగా గణపతిరెడ్డినే కొనసాగించింది.

ప్రస్తుతం ట్రిపులార్ బాధ్యతలను గణపతిరెడ్డి చూస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్‌కు ఎన్‌హెచ్ నెంబర్ కేటాయింపు. కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. అయితే గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటేరియట్, ప్రగతి భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, సెక్రటేరియట్ ఎదుట ఉన్న అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని టిమ్స్ ఆసుపత్రుల అంచనాలు పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న వేళ గణపతిరెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మరింది.


Similar News