సిద్దిపేట జిల్లా RVM ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..
RVM ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.
దిశ, ములుగు: RVM ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో పెద్ద సైజు వెంట్రుకల కట్టతో ఇబ్బంది పడుతున్న బాలికకు సర్జరీ చేసి తొలగించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని RVM హాస్పిటల్ లో చికిత్స చేసిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల గ్రామానికి చెందిన జిన్నారం లావణ్య కృష్ణ దంపతులకు రెండవ కూతురు బేబీ హారిక (12), గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దీంతో సమీపంలో ఉన్న పలు హాస్పిటల్ లలో వైద్యులను సంప్రదించగా నయం కాలేదు.
ఈ క్రమంలోనే RVM ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా వారు అన్ని రకాలైన పరీక్షలు చేసి హారిక పొట్టలో ఊహించని విధంగా వెంట్రుకలు కట్ట ఉందని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించి హారిక పొట్టలోని వెంట్రుకల కట్టను తొలగించారు. కాగా RVM హాస్పిటల్ లో ఇలాంటి అరుదైన చికిత్స చేయడంతో హారిక తల్లిదండ్రులుతో పాటు పలువురు ప్రశంసించారు. శస్త్ర చికిత్స చేసిన వారిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కార్తిక్, డాక్టర్ మురళి కృష్ణ, డాక్టర్ వంశీ వైద్య సిబ్బంది ఉన్నారు.