వికలాంగులకు అన్ని విధాలా ప్రభుత్వం సేవలందిస్తుంది

వికలాంగులకు అన్ని విధాలా ప్రభుత్వం సేవలందిస్తుందని, అవసరమైన ప్రాంతంలో ర్యాంపులు ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు.

Update: 2024-12-16 16:07 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: వికలాంగులకు అన్ని విధాలా ప్రభుత్వం సేవలందిస్తుందని, అవసరమైన ప్రాంతంలో ర్యాంపులు ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత మాట్లాడుతూ… వికలాంగులు తమకు కేటాయించిన పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారని, వారు పని చోట ర్యాంపులు, కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి మాట్లాడుతూ.. వికలాంగులకు సంక్షేమ శాఖ తరపున అమలు అవుతున్న పథకాలను దివ్యంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు నర్సింహాచారి మాట్లాడుతూ… అన్ని కార్యాలయాల్లో వారికి వసతులు కల్పించాలని, అదే విధంగా సదరం సర్టిఫికేట్ ల జారీలో జాప్యం జరగకుండా చూడాలని పిడి డీఆర్డీఏను కోరడం జరిగింది.


Similar News