గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి : చేవెళ్ల ఎమ్మెల్యే
గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని
దిశ, శంకర్పల్లి : గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సహాయకులకు గత నాలుగు రోజులుగా జరిగిన శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచినీటి సహాయకులు శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక సలహాలను పాటించి గ్రామాలలో మంచినీటి సమస్య రాకుండా స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంచినీటి సహాయకులకు సాంకేతిక సలహాలపై శిక్షణ ఇవ్వడం శుభపరిణామం అని శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో వినియోగించుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు. ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేస్తున్న వాటర్ మెన్లు మంచినీటి సహాయకులకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను శిక్షణలో వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డి ఈ హారిక ఏఈ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు సాత ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.