సైకిళ్లపై పోలీసుల పెట్రోలింగ్
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందించిన సైకిళ్లపై పోలీసులు
దిశ, యాచారం : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందించిన సైకిళ్లపై పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎస్సై సత్యనారాయణ, ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో తిరుగుతూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులతో మాట్లాడారు. డ్రగ్స్ సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులకు సహకరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.