ఆన్‌లైన్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. ఎస్సై శ్రీధర్ రెడ్డి
ఆన్‌లైన్ ఏపీకే పెళ్లి పత్రికల పేరుతో ఇటీవల కాలంలో చాలా వరకు మోసాలు జరగుతున్నాయని, వీటి పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు.
దిశ, పెద్దేముల్ : ఆన్‌లైన్ ఏపీకే పెళ్లి పత్రికల పేరుతో ఇటీవల కాలంలో చాలా వరకు మోసాలు జరగుతున్నాయని, వీటి పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పెద్దేముల్ ఎస్సై మాట్లాడుతూ ఆన్‌లైన్ ఏపీకే పెళ్లి పత్రికల పేరుతో, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో, బ్యాంక్ ల పేరుతో ఇటీవల కాలంలో చాలా వరకు మోసాలు జరగుతున్నాయని, వీటి పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అలాగే ఆన్లైన్ లో పేకాట, లుడో, ట్రేడింగ్ తదితర యాప్‌ల ద్వారా చాలా వరకు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా ఆన్‌లైన్ యాప్‌ల వల్ల మోసపోతే తక్షణమే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చుననే ఉద్దేశంతో చాలామంది యువకులు ఆన్‌లైన్ యాప్‌లతో మోసాలకు గురవుతున్నారని వివరించారు. ఇటువంటి ఉచ్చులో పడి తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి మండల ప్రజలకు సూచించారు.
జాగ్రత్త చర్యలు..
మన ఫోన్ కు వచ్చిన లింకు లేదా ఫైల్ లు ఇక్కడి నుండి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరు పంపారో తొందరపడకుండా ఆలోచించి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోండి. వాటి మూలాన్ని ధృవీకరించండి. తెలియని నంబర్ల నుండి వచ్చిన ఫైళ్లు లేదా లింక్లను ఓపెన్ చేయకండి. ముఖ్యంగా అవి ఆహ్వానాలు లేదా డాక్యుమెంట్లుగా కనిపిస్తే వాటిని ఓపెన్ చేయకండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లలో భద్రతా లక్షణాలను ఎనేబుల్ చేసుకోండి. ఎవరైనా మోసపోతే పోలీసులను ఆశ్రయించి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.
తెలియని ఏపీకె ఫైళ్లను దూరంగా ఉండండి : లింకుల ద్వారా పంపిన యాప్లు లేదా ఫైళ్లను ఎన్నటికీ ఇన్స్టాల్ చేయకండి. గూగుల్ ప్లే లేదా యాపిల్ స్టోర్ వంటి నమ్మదగిన స్టోర్లను మాత్రమే ఉపయోగించండి.