పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ వచ్చే సోమవారానికి వాయిదా...
లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా అధికారుల పై జరిగిన దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన సూత్రధారి ఏ1 నిందితుడని పోలీసులు నిర్ధారించారు.
దిశ ప్రతినిధి వికారాబాద్ : లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా అధికారుల పై జరిగిన దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన సూత్రధారి ఏ1 నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా గత బుధవారం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈరోజు (సోమవారం) వికారాబాద్ జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెల్ పిటిషన్ ను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు జిల్లా కోర్టు న్యాయమూర్తి. ఈ కేసు క్రాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొడంగల్ కోర్టులో కస్టడీ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నానికి లగచర్ల గ్రామానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ ఐజి సత్యనారాయణ చేరుకున్నారు. గిరిజన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.