మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు...

బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాలని కొడంగల్

Update: 2024-12-31 06:19 GMT

దిశ,బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి,పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇటీవల రోటి బండ తండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు,బెయిల్ మంజూరు చేసింది.దీని విచారణలో భాగంగా, జనవరి 2న ఉదయం 11.00 గంటలకు బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఐవో(ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) ముందు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి,ఐవో సోమవారం రాత్రి నోటీసులు ఇవ్వడం జరిగింది.


Similar News