కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరులో ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

Update: 2023-11-30 13:06 GMT

దిశ, తాండూరు : తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరులో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుమారుడు రినీష్ రెడ్డి, కూతురు మనిషా రెడ్డిలతో కలిసి మహేందర్ రెడ్డి ఓటు వేశారు. జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి యాలాల మండలంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News