పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.

Update: 2023-02-17 16:24 GMT

దిశ, శంషాబాద్ : పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు సందర్భంగా శంషాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ లు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు పోరాడి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నిరంతరం పేద ప్రజల సంక్షేమం కొరకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలోని పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి ముఖ్యమంత్రిపై ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెన్నం అశోక్, మేకల వెంకటేష్, అజయ్, జహంగీర్ ఖాన్, అమృతా రెడ్డి, బద్రునాయక్,ఆయిల్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, నాయకులు గణేష్ గుప్త, శ్రీనివాస్ గౌడ్, మోహన్ రావు,శ్రీకాంత్ యాదవ్, కొనముల శ్రీనివాస్, ప్రవీణ్ గౌడ్, ప్రభాకర్, పవన్ గౌడ్, నందు, మురళీ యాదవ్, ప్రసాద్, మహేందర్ రెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News