అవకతవకలకు తావు లేకుండా పనిచేయాలి

దేశం అభివృద్ధిలో శ్రామికుల పాత్ర ఎంతో ఉందని, ఇందులో కీలకపాత్ర సివిల్ ఇంజనీర్లదే అని, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

Update: 2024-09-14 13:51 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : దేశం అభివృద్ధిలో శ్రామికుల పాత్ర ఎంతో ఉందని, ఇందులో కీలకపాత్ర సివిల్ ఇంజనీర్లదే అని, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద అంబర్​పేట్ పరిధిలోని తార కన్వెన్షన్ హాల్లో సర్వ సభ్య సమావేశం గుర్రం ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డితో కలిసి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిని భవిష్యత్ వారికి అందించాలని కోరారు. పనుల్లో సివిల్ ఇంజనీర్లు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో పని చేయాలని కోరారు. ఇంజనీర్ల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మేజర్ సమస్యలు ఉన్నట్లయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ఇంజనీర్లకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ ఇంజనీర్​ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News