పోలీస్‌స్టేషన్‌కు హాజరైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి..

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం బొంరాస్

Update: 2024-12-25 11:17 GMT

దిశ,బొంరాస్ పేట్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. గత నెల 11న లగ చర్ల ఘటనలో A1 నిందితునిగా ఉన్న ఆయనకు,నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.కోర్టు ఆదేశాల మేరకు,ప్రతి బుధవారం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సి ఉండటంతో, హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మెట్ల కుంట చెక్ పోస్ట్ దగ్గర,మాజీ ఎమ్మెల్యేకు టపాకాయలు కాలుస్తూ, గిరిజన మహిళలు బొట్టు పెట్టి, ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాష, యాదగిరి,నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,సలీం,కోట్ల మహిపాల్,నారాయణరెడ్డి,సుదర్శన్ రెడ్డి, మహేందర్ రెడ్డి,దేశ్యానాయక్,తిరుపతయ్య,నర్మద కిష్టప్ప,మహేందర్,రవి గౌడ్,రామకృష్ణగౌడ్,నరసింహ నాయక్,తదితరులు ఉన్నారు.


Similar News