దిశ ఎఫెక్ట్ .. స్పందించిన అధికారులు
తాండూరు మున్సిపల్ "చికెన్ వ్యర్థాలతో దందా ! " అనే శీర్షికన ఈ నెల 14వ తేదీన దిశ దినపత్రికలో వార్త కథనం ప్రచురితమైంది.
దిశ, తాండూరు : తాండూరు మున్సిపల్ "చికెన్ వ్యర్థాలతో దందా ! " అనే శీర్షికన ఈ నెల 14వ తేదీన దిశ దినపత్రికలో వార్త కథనం ప్రచురితమైంది. అందుకు స్పందించిన తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి చికెన్ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలంకు ప్రకటన విడుదల చేశారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న మటన్, చికెన్, ఫిష్ దుకాణాల ద్వారా వెలువడే వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఒక ప్రకటనలు తెలిపారు.
స్పందించిన మున్సిపల్ అధికారులు..
డైలీ బేసిస్ పై చికెన్, మటన్, ఫిష్ లను కట్ చేసిన అనంతరం మిగిలిపోయే వ్యర్ధాలను సేకరించి , రవాణా చేయుటకు సైంటిఫిక్ డిస్పోజల్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను కోరుతూ టెండర్లను విడుదల చేశామని కమిషనర్ చెప్పారు. ఈ టెండర్లల్లో పాల్గొని వ్యక్తులు అనుభవదారి కంపెనీలు/సంస్థలు/ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనైనదని పేర్కొన్నారు . "ఇన్ ఫేవర్ ఆఫ్ ది కమిషనర్ , తాండూర్ మున్సిపాలిటీ " పేరున ప్రభుత్వం గుర్తింపు పొందిన బ్యాంకు నుండి తీసిన డిడి ద్వారా రూ.5వేలు చెల్లించేలా డిడి కాపీ ప్రతిని జతపరిచి ఈ నెల 27 సాయంత్రం 4 గంటల వరకు తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 28 తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం యందు బహిరంగంగా వేలం (ఓపెన్ యాక్షన్) వేయుటకు నిర్ణయించామన్నారు. కావున ఇట్టి బహిరంగంగా వేలం (ఓపెన్ యాక్షన్) యందు పాల్గొనే ఆసక్తి గల (అభ్యర్థులు) వ్యక్తులు ఈ క్రింద తెలిపిన నియమ నిబంధనలు పాటించవలెనని చెప్పారు. కంపెనీ ప్రొఫైల్, క్రెడియన్షియల్స్, అనుభవం, ఏవేని ఇతర సంబంధిత పత్రాలను దాఖలు చేయవలెను. బహిరంగ వేలం యందు పాల్గొను పాటదారు రూ.1, 00,000 రూపాయల(డి.డి లేక నగదు రూపములో జమ చేయవలెను). వేలం దక్కని వారికి ఈ రూపాయలు తిరిగి చెల్లించ బడును అన్నారు. మరింత పూర్తి సమాచారం కోసం మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరని తెలిపారు. చికెన్ వ్యర్థాల బహిరంగ వేలం ద్వారా మున్సిపల్ ఆదాయం ఆదాయం వచ్చే అవకాశం ఉండటం వలన తాండూరు పట్టణ ప్రజలు దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.