దిశ ఎఫెక్ట్ : స్పందించిన అధికారులు

మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో గత సంవత్సరం 2023 లో రూ.17 లక్షలతో మిషన్ భగీరథ పథకం కింద సుమారు 40000 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును నిర్మించారు

Update: 2024-12-02 09:26 GMT

దిశ, తలకొండపల్లి : మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో గత సంవత్సరం 2023 లో రూ.17 లక్షలతో మిషన్ భగీరథ పథకం కింద సుమారు 40000 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును నిర్మించారు. కానీ గత 4 నుండి 5 నెలల క్రితం వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు నింపిన తర్వాత గేట్ వాళ్లు లీకేజీ కారణంగా నీరు మొత్తం వృధాగా పోతుందని, ఆదివారం ఉదయం దిశలో వెబ్ లింకు వెలువడింది. లింకు వెలువడిన వెంటనే తలకొండపల్లి ఎంపీడీవో శ్రీకాంత్ స్పందించి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి.జమీరుద్దీన్ తో ఆదివారం సైతం ట్యాంకు వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి, ట్యాంకు వద్ద నీరు నిలుస్తుండడంతో 3 నుండి 4 టిప్పర్ల మొరం మట్టిని త్రోలి, స్థానిక పంచాయతీ కార్మికులచే ట్యాంకు పరిసర ప్రాంతాలను మొత్తం శుభ్రం చేయించారు. అదేవిధంగా ప్రాబ్లం ఉన్న గేట్ వాల్ ను తీసి రిపేరుకు సైతం పంపించారు. సోమవారం సాయంత్రం లోపు గేట్ వాళ్లు మళ్లీ అమర్చి గ్రామస్తులకు త్రాగు నీరు సరఫరా చేస్తామని దిశకు విన్నవించారు. దిశ కథనంతో అధికారుల స్పందించినందుకు మండల ప్రజలతోపాటు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


Similar News