నిజాలు నిర్భయంగా రాయడంలో ‘దిశ’ ప్రత్యేకత : కల్వకుర్తి ఎమ్మెల్యే

నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ దినపత్రిక శైలి

Update: 2024-12-31 06:52 GMT

దిశ,తలకొండపల్లి/ఆమనగల్ : నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ దినపత్రిక శైలి వేరు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో దిశ రిపోర్టర్ లు నరేష్, చంద్రకుమార్, మహేష్, శ్రీనివాస్ సమక్షంలో 2025 'దిశ' క్యాలెండర్ ని ఎమ్మెల్యే కసిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఎలాంటి సంఘటనలు జరిగినా క్షణాల్లో విషయాన్ని పాఠకుల ముందుకు చేర్చడంలో దిశ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని అన్నారు.

సమాజంలో ప్రతినిత్యం జరుగుతున్న కార్యక్రమాలను డిజిటల్ మీడియాతో పాటు పత్రికలో త్వరితగతిన ప్రచురించి సమాజంలో పత్రికల పట్ల ఔనత్యాన్ని పెంపొందించేందుకు దిశ ఎంతో కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లోనూ ఇదే పంతాను కొనసాగిస్తూ, దిశ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి,మాడ్గుల మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, మాజీ సర్పంచులు రమేష్ యాదవ్, రఘుపతి, శ్రీశైలం, విట్టలయ్య గౌడ్, చుక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజలింగం, జాతీయ హ్యూమన్ రైట్స్ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్, సుబ్రహ్మణ్యం, పిఎసిఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News