రేపు దామగుండం నేవీ రాడార్ స్టేషన్ ప్రారంభం..
దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్ఎఫ్ ( వెరీ లో ఫ్రీక్వెన్సీ ) స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించారు
దిశ ప్రతినిధి వికారాబాద్ : దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్ఎఫ్ ( వెరీ లో ఫ్రీక్వెన్సీ ) స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించారు. వికారాబాద్ సమీప లోని దామగుండం ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలు మంగళవారం మధ్యాహ్నం నేవి రాడర్ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ భద్రత, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ బృందాలతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, నావికాదళ అధికారులు సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు, సలహాలు చేశారు. శంకుస్థాపన చేపట్టే కార్య స్థలాన్ని, వికారాబాద్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతిలు పాల్గొన్నారు.