అందరూ మెచ్చిన పత్రిక "దిశ"
పత్రికా రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రజలందరూ మెచ్చిన పత్రికగా దిశ ఎదుగుతున్నదని పలువురు కొనియాడారు.
దిశ, కొత్తూరు : పత్రికా రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రజలందరూ మెచ్చిన పత్రికగా దిశ ఎదుగుతున్నదని పలువురు కొనియాడారు. శుక్రవారం మండల కేంద్రంలో దిశ దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండరును కొత్తూర్ మండల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ .. దిశ దిన పత్రిక అతి తక్కువ సమయంలో అందరి ఆదరాభిమానాలు పొందిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభ్యున్నతి చెందాలని ఆకాంక్షించారు. వాస్తవాలు రాసే పత్రికగా.. సామాన్యుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే పత్రికగా దిశ కు కొత్తూర్ మండలంలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నశ్రత్ బేగం, కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, మునిసిపాలిటీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు అంబటి ప్రభాకర్, లింగారం సురేష్ గౌడ్,శేఖర్ గుప్తా, మంకాల శ్రీశైలం, శివ,పాషా, నందు తదితరులు పాల్గొన్నారు.