క్రీడలతో నూతన ఉత్తేజం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

క్రీడలతో నూతన ఉత్తేజం కలుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. జర్నలిస్టు...Cricket Tournament

Update: 2023-02-11 04:49 GMT
క్రీడలతో నూతన ఉత్తేజం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
  • whatsapp icon

దిశ, శంషాబాద్: క్రీడలతో నూతన ఉత్తేజం కలుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రొఫేసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం ఎంతో బిజీగా ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు వార్తలు సేకరిస్తూ ఉంటారని, అలాంటి సందర్భాల్లో క్రికెట్ నిర్వహించడం వారిని నూతన ఉత్తేజపరచడమే అన్నారు. క్రిడలలో గెలుపు ఓవటములు సహజమని, గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, కొమురయ్య, శ్రీధర్, మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు పలుగు చెరువు మహేష్, ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News