భార్య భర్తల మధ్య రూ. 500 పెట్టిన చిచ్చు.. తల్లి, ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యం
భర్తతో గొడవపడి ఇంట్లో నుండి ఇద్దరు పిల్లలతో సహా తల్లి
దిశ, శంషాబాద్ : భర్తతో గొడవపడి ఇంట్లో నుండి ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం అయిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవ్వగూడ గ్రామంలో చోటుచేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం శేఖర్, అతని భార్య మంగమ్మ వీరికి ఒక కొడుకు జగదీష్ (1) కూతురు ఉష (నాలుగు నెలలు) ఉన్నారు. మంగళారం శేఖర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భార్య మంగళారం మంగమ్మ ఇంట్లో బుధవారం రోజు రూ. 500 తీసుకున్నదని భర్త గొడవ పడటం తో భర్త ఆటో తీసుకొని డ్రైవింగ్ వెళ్లాడు.
భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. అయితే సాయంత్రం భర్త మంగళవారం శేఖర్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న అతని భార్య మంగమ్మ కొడుకు జగదీష్ కూతురు ఉష కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి బంధువుల వద్ద వాకబు చేసిన ఎక్కడ కనిపించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడని ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.