DSP Balakrishna Reddy : మైనర్లకు వాహనాలు ఇవ్వకండి
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని
దిశ,తాండూరు: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.గురువారం పట్టణంలో ని డిఎస్పీ కార్యాలయం లో పట్టణంలోని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మైనర్స్ డ్రైవింగ్ చేయడం ఎక్కువగా ఉందన్నారు.మైనర్స్ వాహనాలు నడిపి పట్టుబడితే వారిపైన మరియు వాహన యాజమానుల పైన కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్రవాహనంపై స్కూల్స్, కాలేజీలకు రాకుండా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అధికారులు కూడా విద్యాసంస్థలలో వీటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నరని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.