మురుగు పారదు... కంపు వదలదు

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు గంగాభవాని కాలనీలో

Update: 2024-08-29 13:28 GMT

దిశ,ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు గంగాభవాని కాలనీలో మురుగు అస్తవ్యస్తంగా తయారైంది. కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి.ఇళ్ల ముందు చెత్త కుప్పలుగా ఉండటంతో వీటికి ఆనుకొని ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు దోమల బెడద అధికంగా ఉన్నాయని, దోమకాటుకు ఎప్పుడు ఏ రోగం సోకుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాలని మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు.

ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు : వాటర్ బాబా, 8వ వార్డ్, ఆమనగల్లు మున్సిపాలిటీ

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రారంభమై,వైరల్ ఫీవర్ సోకుతున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ అధికారులు విఫలం అవుతున్నారు. కాలువలలో చెత్త పేరుకుపోయి కొన్ని రోజులు గడుస్తున్న అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్యలో మురికి నీరు నిలవడంతో దోమలు విజృంభించి రోగాల పాలవుతున్నాం.


Similar News