ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్.. ఇంతకీ ఏం జరిగింది..

విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Update: 2025-03-16 05:17 GMT

దిశ, శంషాబాద్ : విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కౌలాలంపూర్ నుండి 73 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం, అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం విమాన పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఎయిర్ లోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని గమనించిన పైలెట్ వెంటనే శంషాబాద్ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎయిర్ ఏషియా విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దీనితో విమానంలో ఉన్న 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఏర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Similar News