వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించాలి
తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను, పాలక మండల సభ్యులను బీసీలకు కేటాయించాలని జాతీయ కార్యవర్గ సభ్యులు బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఓ ప్రకటనలో తెలిపారు.
దిశ, తాండూరు : తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను, పాలక మండల సభ్యులను బీసీలకు కేటాయించాలని జాతీయ కార్యవర్గ సభ్యులు బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి ఈనెల 20నాటితో ముగియడంతో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఎన్నుకోనున్నారు. తాండూర్ నియోజకవర్గంలో 65 శాతం మంది బీసీలు ఉన్నారు.
కాబట్టీ ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో తాండూర్ ఎమ్మెల్యే చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఓసి రిజర్వేషన్ ను తొలగించి బీసీలకు నూతనపాలక వర్గంలో చోటు కల్పించాలని కోరారు. తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం బీసీల కేటాయించాలని తెలిపారు. ఎక్కువ శాతం బీసీలే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారని దానికనుగుణంగా బీసీలకు మార్కెట్ కమిటీ పాలకమండలిలో స్థానం కల్పించడం వల్ల సమన్యాయం చేసిన విధంగా అవుతుందని తెలిపారు.