వికారాబాద్ మున్సిపల్ కు 60 కోట్ల నిధులు

వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అందరం ముందుకువెళ్లి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

Update: 2023-03-02 17:17 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అందరం ముందుకువెళ్లి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయా సమ్మేళనం కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు అడిగిన ప్రతికోరిక తిరుస్తున్నాను అన్నారు. మీరు అడిగిన జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ కు మార్చమన్నారు.

వికారాబాద్ కు బ్రిడ్జ్ కావాలనగానే బ్రిడ్జ్ మంజూరు చేయించానని తెలిపారు. మన్నెగూడ వరకు నాలుగు లైన్ ల రోడ్డు కావాలంటే అది చేశానన్నారు. వికారాబాద్ మున్సిపల్ కు 60 కోట్లు తీసుకొచ్చాము. ఆనంద్ సమక్షంలో ఎలక్షన్ కోడ్ అవ్వగానే జీవో తీసుకొస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. వచ్చేసారి ఆనంద్ కు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అత్యంత ప్రియ శిష్యుడు, ఇష్టమైన ఆనంద్ కె ఈసారి కూడా బీఆర్ఎస్ బి ఫామ్ వస్తుందని, కాబోయే ఎమ్మెల్యే కూడా ఆయనే అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News