మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టుకు రామేశ్వర్ పల్లి రైతులు

ఇటీవల వివాదాస్పదమైన కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లెక్కారు.

Update: 2023-01-07 01:53 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : ఇటీవల వివాదాస్పదమైన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లెక్కారు. వ్యవసాయ భూములను లాక్కుని రైతులను భయాందోళనకు గురి చేసి వారి ఆగ్రహానికి కారణం అయిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు హై కోర్టు‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషనల్ జోన్‌గా ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ హై కోర్టును ఆశ్రయించారు.

కాగా ఈ కేసును హై కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్టు రైతుల తరపున న్యాయవాది టి. సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను చూస్తే కేవలం రైతుల పట్టా భూములను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని అన్నారు. ఇదే రామేశ్వర్ పల్లి రెవెన్యూ గ్రామంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టణాభివృద్ధి అవకాశ ప్రాంతం (Urbanisable) గా చూపించటం అనేక అనుమానాలకు తావిస్తుందని కేసు వేసిన రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకొని రైతుల భూముల జోలికి రావొద్దని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు కైనా వెళ్తామని హెచ్చరించారు.

Also Read...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: అయోమయంలో అధికార పార్టీ! 

Tags:    

Similar News