కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రామ్ గోపాల్ వర్మ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్య, నాగార్జున, కేటీఆర్ లపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారడంతో సినీ ఇండస్ట్రీ ఏకమై ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

Update: 2024-10-03 07:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్య, నాగార్జున, కేటీఆర్ లపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారడంతో సినీ ఇండస్ట్రీ ఏకమై ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. దీంతో కొండా సురేఖ గురువారం ఉదయం హీరోయిన్ సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని, తన వ్యాఖ్యల వల్ల సమంత మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

కాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ ఆర్జీవి స్పందించారు. ఈ సందర్భంగా తన ట్విట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. "కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే.. తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో వుండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని.. నాగచైతన్య, నాగార్జునలు మంత్రి కొండా సురేఖకు మరచిపోలేని గుణపాఠం నేర్పాలని రాసుకొచ్చారు.


Similar News