ED Notice to Rakul Preet Singh :రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆ కేసుతో సంబంధం ఉంది:

డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.

Update: 2022-12-16 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛార్జీషీట్ ఫైల్ చేయకుండానే బెంగళూరు డ్రగ్స్ కేసు ఎలా క్లోజ్ అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు రావచ్చని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రూ. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

Also Read:
ఈడీ నోటీసులపై పైలెట్ రోహిత్ రెడ్డి అనూహ్య నిర్ణయం!

Tags:    

Similar News